శుక్రవారం 03 జూలై 2020
Sports - May 27, 2020 , 00:13:09

క్రీడా కార్యకలాపాలు షురూ

 క్రీడా కార్యకలాపాలు షురూ

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ఔట్‌డోర్‌ స్టేడియాల్లో క్రీడల పునరుద్ధరణ దశల వారీగా జరుగుతున్నది. రాజధాని ఢిల్లీలో ఐదింటిలో రెండు స్టేడియాల్లో మంగళవారం క్రీడా కార్యకలాపాలను భారత క్రీడా ప్రాధికార సంస్థ(సాయ్‌) మొదలుపెట్టింది. ఆన్‌లైన్‌లో ప్రి బుకింగ్‌ను ఆధారంగా చేసుకుంటూ జవహర్‌లాల్‌ నెహ్రు స్టేడియం, మేజర్‌ ధ్యాన్‌చంద్‌ స్టేడియాల్లో క్రీడలను పునరుద్ధరించినట్లు సాయ్‌ పేర్కొంది. ఇందిరా గాంధీ స్టేడియంతో పాటు కర్నిసింగ్‌ షూటింగ్‌ రేంజ్‌లో వారం వ్యవధిలో శిక్షణ శిబిరాలు మొదలయ్యే అవకాశముండగా, స్విమ్మింగ్‌ కాంప్లెక్స్‌లో ప్రవేశంపై నిషేధం కొనసాగనుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా స్టేడియాలను పూర్తిగా శానిటైజ్‌ చేయడంతో పాటు థర్మల్‌ స్క్రీనింగ్‌, చేతులు శుభ్రం చేసుకున్న తర్వాతే అథ్లెట్లను లోపలికి అనుమతిస్తున్నామని సాయ్‌ అధికారులు తెలిపారు. 


logo