గురువారం 25 ఫిబ్రవరి 2021
Sports - Feb 14, 2021 , 19:52:41

విండీస్‌ థ్రిల్లింగ్‌ విక్టరీ..సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌

విండీస్‌ థ్రిల్లింగ్‌ విక్టరీ..సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌

ఢాకా: టెస్టు సిరీస్‌లో వెస్టిండీస్‌ను తక్కువ అంచనా వేసిన బంగ్లాదేశ్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సొంతగడ్డపై వన్డే సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకున్న బంగ్లా..టెస్టు సిరీస్‌ను కరీబియన్లకు సమర్పించుకున్నది. తొలి టెస్టులో 3 వికెట్లతో గెలిచిన విండీస్‌..రెండో టెస్టులో ఆతిథ్య జట్టును 17 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను కరీబియన్‌ జట్టు 2-0తో క్వీన్‌స్వీప్‌ చేసింది. 

విండీస్‌ నిర్దేశించిన 231 పరుగుల లక్ష్యంతో  బరిలోకి దిగిన బంగ్లా 213 పరుగులకే కుప్పకూలింది.  రఖీమ్‌ కార్న్‌వాల్(4/105) సంచలన ప్రదర్శనకు తోడు క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌(3/25), వారికన్‌(3/47) కట్టుదిట్టంగా బంతులేయడంతో బంగ్లా  213 పరుగులకు పరిమితమైంది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును కార్న్‌వాల్‌(5/74, 4/105) దక్కించుకున్నాడు. విండీస్‌ స్పిన్నర్లే ఏకంగా 10 వికెట్లు పడగొట్టడం విశేషం.

తొలి ఇన్నింగ్స్‌:

విండీస్‌:409

బంగ్లా:296

రెండో ఇన్నింగ్స్‌:

విండీస్‌:117

బంగ్లా:213

VIDEOS

logo