గురువారం 24 సెప్టెంబర్ 2020
Sports - Aug 20, 2020 , 00:36:58

కోట్లా స్టేడియంలో చౌహాన్‌ స్టాండ్‌!

కోట్లా స్టేడియంలో చౌహాన్‌ స్టాండ్‌!

న్యూఢిల్లీ: ఫిరోజ్‌షా కోట్లా స్టేడియంలోని ఓ స్టాండ్‌కు భారత మాజీ క్రికెటర్‌ చేతన్‌ చౌహాన్‌ పేరు పెట్టేందుకు ఢిల్లీ డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(డీడీసీఏ) సిద్ధమవుతున్నది.  కరోనా వైరస్‌తో ఈ మధ్యే మరణించిన చౌహాన్‌ చేసిన సేవలకు గుర్తింపుగా డీడీసీఏ తగిన గౌరవం ఇచ్చేందుకు ఆలోచిస్తున్నది. ఉపాధ్యక్ష పదవి నుంచి చీఫ్‌ సెలెక్టర్‌గా డీడీసీఏకు చేతన్‌ అందించిన విశేష సేవలను దృష్టిలో పెట్టుకుని అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో నిర్ణయం తీసుకుంటామని డీడీసీఏ సంయుక్త కార్యదర్శి రంజన్‌ మన్‌చందా బుధవారం పేర్కొన్నాడు. మీడియాతో రంజన్‌ మాట్లాడుతూ ‘చౌహాన్‌ జ్ఞాపకార్థంగా ఏదైనా చేయాలంటూ పలువురు సభ్యుల నుంచి సలహాలు, సూచనలు వచ్చాయి. కోట్లా స్టేడియంలో ఒక స్టాండ్‌కు చౌహాన్‌ పేరు పెట్టాలంటూ సూచించారు. త్వరలో జరిగే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో దీనిపై చర్చిస్తాం’ అని అన్నాడు.ఇప్పటికే కోట్లా స్టేడియంలో నాలుగు స్టాండ్లకు పటౌడీ, అమర్‌నాథ్‌, బేడీ, గంభీర్‌ పేర్లు పెట్టగా, సెహ్వాగ్‌, అంజుమ్‌ చోప్రా పేరిట రెండు గేట్లు ఉన్నాయి. అయితే చౌహాన్‌ పేరును ఎక్కడ కేటాయిస్తారనే దానిపై ఆసక్తి నెలకొన్నది.  


logo