సోమవారం 01 మార్చి 2021
Sports - Jan 24, 2021 , 13:09:23

ఆ మ్యాచ్‌ నుంచే స్టేడియంలోకి ప్రేక్షుకులకు అనుమతంట!

ఆ మ్యాచ్‌ నుంచే స్టేడియంలోకి ప్రేక్షుకులకు అనుమతంట!

ముంబై : దేశంలో కరోనా ప్రభావం క్రమంగా తగ్గుతూ.. కొత్త రోగుల సంఖ్య గణనీయంగా పడిపోతున్నది. కరోనా వైరస్‌ నివారణకు పలు దేశాల్లో వ్యాక్సిన్‌ ఇవ్వడం కూడా మొదలైంది. మొత్తంమీద మన దేశంలో పరిస్థితి ఇప్పుడు కొద్దిగా అదుపులోనే ఉన్నది. దీని ప్రభావం క్రికెట్ మైదానంలో కూడా చూడవచ్చు. లాక్‌డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి క్రికెట్ అభిమానులు స్టేడియంకు రాలేకపోయారు. అయితే, వచ్చే నెల ఐదో తేదీ నుంచి  భారత్‌లో జరిగే ఇంగ్లండ్‌ పర్యటన బీసీసీఐకి అగ్నిపరీక్ష కానున్నది. క్రికెట్‌ ఆటను దగ్గరనుంచి చూడ్డానికి మొహం వాచి ఉన్న అభిమానులు.. హోం సిరీస్‌ కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నారు. హోం సిరీస్‌కు ప్రేక్షకులను అనుమతించడంపై బీసీసీఐ ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతున్నది. 

ఇంగ్లండ్‌తో మార్చి నెల రెండో వారం నుంచి జరిగే టీ 20 సిరీస్ నుంచి ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించడంపై బీసీసీఐ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తున్నది. టీ20 సిరీస్ మొదటి మ్యాచ్ మార్చి 12 న అహ్మదాబాద్‌లోని మోతేరా స్టేడియంలో జరుగనున్నది. అభిమానులను స్టేడియంలోకి అనుమతించే విషయం ప్రభుత్వ నిర్ణయం మేరకు ఉంటుందని బీసీసీఐ అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం అనుమతించినా గతంలో మాదిరిగా స్టేడియంలు ఫుల్‌ ప్యాకై కనిపించే పరిస్థితులు లేవనే చెప్పాలి. 50 శాతం సామర్ధ్యంతో ప్రేక్షుకుల ప్రవేశాన్ని బోర్డు ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని త్వరలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వపరంగా అనుమతి పొందేలా బీసీసీఐ చర్యలు తీసుకొంటున్నది.

టెస్ట్ మ్యాచ్‌లకు టికెట్ అమ్మకం లేదు

భారత్, ఇంగ్లండ్ మధ్య సిరీస్ టెస్టు మ్యాచుతో ప్రారంభమవుతుంది. మొదటి రెండు టెస్టులు ఫిబ్రవరి 5–09, ఫిబ్రవరి 13–17 తేదీలలో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతాయి. ఈ మ్యాచ్‌లకు టికెట్లు అమ్మడం లేదని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఇప్పటికే స్పష్టం చేసింది.

ఇండియా-ఇంగ్లండ్ షెడ్యూల్:

మొదటి టెస్ట్: 05-09 ఫిబ్రవరి, ఎంఏ చిదంబరం స్టేడియం, చెన్నై, ఉదయం 09:30

రెండవ టెస్ట్: 13-17 ఫిబ్రవరి, ఎంఏ చిదంబరం స్టేడియం, చెన్నై, ఉదయం 09: 30

మూడవ టెస్ట్: 24-28 ఫిబ్రవరి, సర్దార్ పటేల్ స్టేడియం, అహ్మదాబాద్, మధ్యాహ్నం 02:30 (డే అండ్‌ నైట్‌ టెస్ట్)

నాల్గవ టెస్ట్: 04-08 మార్చి, సర్దార్ పటేల్ స్టేడియం, అహ్మదాబాద్, ఉదయం 09:30


మొదటి టీ20: మార్చి 12, సాయంత్రం 07:00, అహ్మదాబాద్

రెండవ టీ20: మార్చి 14, సాయంత్రం 07:00, అహ్మదాబాద్

మూడవ టీ20: మార్చి 16, సాయంత్రం 07:00, అహ్మదాబాద్

నాల్గవ టీ20: మార్చి 18, సాయంత్రం 07:00, అహ్మదాబాద్

ఐదవ టీ20: మార్చి 20, సాయంత్రం 07:00, అహ్మదాబాద్


మొదటి వన్డే: మార్చి 23, మధ్యాహ్నం 01:30, పుణే

రెండవ వన్డే: మార్చి 26, మధ్యాహ్నం 01:30, పుణే

మూడవ వన్డే: మార్చి 28, మధ్నాహ్నం 01:30, పుణే


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo