ఆదివారం 12 జూలై 2020
Sports - Jun 24, 2020 , 01:11:02

ఆ క్షణాలు అద్వితీయం: సైనా

ఆ క్షణాలు అద్వితీయం: సైనా

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఒలింపిక్‌ దినోత్సవం (జూన్‌ 23) సందర్భంగా భారత టాప్‌ ప్లేయర్లు తమ అనుభవాలు పంచుకున్నారు. స్టార్‌ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌, హైదరాబాదీ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ ఒలింపిక్‌ పతకం గెలిచిన సందర్భాలను మంగళవారం గుర్తు చేసుకున్నారు. ‘2008 ఒలింపిక్‌ పతకంతో నా జీవితం మారిపోయింది. 2012 పతకంతో చరిత్రకెక్కాను. ఈసారి స్వర్ణం నెగ్గాలని కృషిచేస్తున్నా’ అని సుశీల్‌ ట్వీట్‌ చేశాడు. ‘ప్రతిష్టాత్మక లండన్‌ ఒలింపిక్‌ (2012) క్రీడల్లో కాంస్యం నెగ్గడం నా జీవితంలో అత్యంత మధుర క్షణం. రాకెట్‌ పట్టిన పుష్కర కాలం తర్వాత అది సాధ్యమైంది. దాని కోసం నేను నా కుటుంబ సభ్యులు ఎంతో కష్టపడ్డాం’ అని సైనా నెహ్వాల్‌ ట్వీట్‌ చేసింది. 


logo