మోంట్మెలో (స్పెయిన్): ఏడుసార్లు ఫార్ములావన్ ప్రపంచ చాంపియన్, బ్రిటన్ స్టార్ రేసర్ లూయిస్ హామిల్టన్ స్పానిష్ గ్రాండ్‌ప్రి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం ఇక్కడ ఉత్కంఠ మధ్య జరిగిన రేసులో మ్యాక్స్ వెర్స్టాపెన్ (రెడ్‌బుల్)ను వెనక్కినెట్టి మెర్సెడెజ్ స్టార్ హామిల్టన్ కెరీర్లో 98వ విజయాన్ని సాధించాడు. 100వ సారి పోల్ పొజిషన్ నుంచి రేసు ప్రారంభించిన లూయిస్ తొలుత వెనుకబడ్డా.. రెండో స్థానంలో నిలిచిన వెర్స్టాపెన్ కన్నా 15 సెకన్లు ముందుగానే గమ్యాన్ని దాటాడు. మూడోస్థానంలో మెర్సెడెజ్కే చెందిన వాల్తెరీ బొటాస్ నిలిచాడు. ఈ విజయంతో డ్రైవర్ చాంపియన్‌షిప్‌లో వెర్స్టాపెన్ను దాటి హామిల్టన్ 14 పాయింట్ల ఆధిక్యంతో అగ్రస్థానానికి చేరాడు.