శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Mar 17, 2020 , 13:03:34

యూరప్‌ కకావికలం..ఫుట్‌బాల్‌ కోచ్‌ మృతి

యూరప్‌ కకావికలం..ఫుట్‌బాల్‌ కోచ్‌ మృతి

లండన్‌:  కరోనా వైరస్‌(కోవిడ్‌-19)  యూరప్‌ దేశాలను అతలాకుతలం చేస్తోంది.  మహమ్మారి కారణంగా ఇటలీలో 2,158 మంది మృతి చెందగా.. స్పెయిన్‌లో 335  మంది మరణించారు. తాజాగా స్పానిష్‌ ఫుట్‌బాల్‌ కోచ్‌ ఫ్రాన్సికో గార్సియా కరోనా వైరస్‌ వల్ల ప్రాణాలు కోల్పోయాడు. అతని వయసు కేవలం 21ఏండ్లే.  ప్రపంచంలోనే అతి తక్కువ వయసులో  లుకేమియాతో పోరాడుతూ మృతిచెందిన వ్యక్తిగా ఫ్రాన్సికో నిలిచాడు.  ఇప్పటికే లుకేమియాతో బాధపడుతున్న ఫ్రాన్సికోలో కరోనా లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మలాగా ప్రాంతంలో కరోనా కారణంగా మరణించిన ఐదో వ్యక్తి గార్సియా కాగా.. మిగతా వారందరి వయసు 70-80 ఏండ్లుగా ఉంది. 

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యగా స్పానిష్ ఫుట్‌బాల్ లీగ్‌ను 2 వారాల పాటు వాయిదా వేశారు. స్పెయిన్‌లో ఇప్పటి వరకు 9,407 కేసులు నమోదు కాగా.. 335 మంది మృతి చెందారు. యూరప్‌లో ఇప్పటి వరకు 55వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. చైనా తర్వాత అత్యంత ఎక్కువగా ప్రభావితమైంది యూరప్‌ దేశాలే. ఇప్పటికే ఆయా దేశాలన్నీ సరిహద్దులను మూసివేసి..పలు దేశాలకు ప్రయాణాలను నిషేధించాయి. 

ఇటలీ: 

నమోదైన కేసులు:27,980

మృతుల సంఖ్య: 2,158

ఫ్రాన్స్‌:

నమోదైన కేసులు: 6,633

మృతుల సంఖ్య:148

జర్మనీ:

నమోదైన కేసులు: 6,012

మృతుల సంఖ్య:13

స్పెయిన్‌:

నమోదైన కేసులు:  9,407

మృతుల సంఖ్య: 335 


logo