సోమవారం 18 జనవరి 2021
Sports - Dec 02, 2020 , 02:06:37

భారత సీనియర్‌ క్యాంప్‌లో సౌమ్య

భారత సీనియర్‌ క్యాంప్‌లో సౌమ్య

హైదరాబాద్‌, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ గుగులోతు సౌమ్య.. భారత సీనియర్‌ మహిళల జట్టు శిక్షణ శిబిరానికి ఎంపికైంది. మంగళవారం నుంచి గోవాలో మొదలైన క్యాంప్‌లో సీనియర్లతో కలిసి సౌమ్య ప్రాక్టీస్‌లో పాల్గొననుంది. స్వదేశం వేదికగా 2022లో జరిగే ఆసియా మహిళల చాంపియన్‌షిప్‌ సన్నాహాల్లో భాగంగా టీమ్‌ఇండియా క్యాంప్‌ మొదలైంది. కరోనా వైరస్‌ విజృంభణ తర్వాత చాలా రోజులకు సీనియర్‌ జట్టు తొలిసారి ట్రైనింగ్‌ క్యాంప్‌లో పాల్గొంటున్నది.