శనివారం 08 ఆగస్టు 2020
Sports - Aug 02, 2020 , 10:03:39

వెస్టిండీస్‌, శ్రీలంకలో సౌతాఫ్రికా టీమ్‌ పర్యటన వాయిదా

వెస్టిండీస్‌, శ్రీలంకలో సౌతాఫ్రికా టీమ్‌  పర్యటన  వాయిదా

జోహాన్నెస్‌బర్గ్‌:  కరోనా వల్ల దాదాపు అన్ని దేశాల్లో పరిస్థితులు రోజురోజుకూ మరింత ఇబ్బందికరంగా మారుతున్నాయి. దీంతో క్రీడా ఈవెంట్లు, క్రికెట్‌ టోర్నీలు కూడా వాయిదా పడుతున్నాయి. తాజాగా కరోనా మహమ్మారి కారణంగా  వెస్టిండీస్‌, శ్రీలంకలో సౌతాఫ్రికా జట్టు పర్యటన నిరవధికంగా వాయిదా పడింది.   

దక్షిణాఫ్రికా జూలై-ఆగస్టులో రెండు టెస్టులు, ఐదు టీ20ల సిరీస్‌ కోసం వెస్టిండీస్‌ టూర్‌కు వెళ్లాల్సి ఉంది. అలాగే జూన్‌లో  శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లో తలపడాల్సి ఉంది. కరోనా వైరస్‌ కారణంగా రెండు టూర్లు వాయిదా పడ్డాయి.  శ్రీలంక, వెస్టిండీస్‌లో సౌతాఫ్రికా పర్యటనలు వాయిదాపడినట్లు క్రికెట్‌ సౌతాఫ్రికా డైరెక్టర్‌ గ్రేమ్‌ స్మిత్‌ ధ్రువీకరించారు. logo