గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Mar 23, 2020 , 11:23:15

కనికా బస చేసిన హోటల్లోనే సౌతాఫ్రికా క్రికెటర్లు

కనికా   బస చేసిన హోటల్లోనే  సౌతాఫ్రికా క్రికెటర్లు

న్యూఢిల్లీ:  మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం ఇటీవల  సౌతాఫ్రికా క్రికెట్‌ జట్టు భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడం కోసం భారత్‌, సౌతాఫ్రికా వన్డే సిరీస్‌ను బీసీసీఐ రద్దు  చేసింది. ఐతే బాలీవుడ్‌ సింగర్‌ కనికా కపూర్‌ బస చేసిన హోటల్‌లోనే సఫారీ క్రికెటర్లు కూడా   బస చేశారు.  లండన్‌ నుంచి భారత్‌కు వచ్చిన కనికా సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉండకుండా లక్నోలోని తాజ్‌హోటల్‌లో నిర్వహించిన పార్టీకి హాజరైంది. 

గత శుక్రవారం ఆమెకు కోవిడ్‌-19 పాజిటివ్‌ ఉన్నట్లు తేలడంతో సౌతాఫ్రికా క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  మార్చి 13న రెండు జట్ల ఆటగాళ్లు, కోచింగ్‌ సిబ్బంది మాస్కులు ధరించి లక్నో చేరుకున్న విషయం తెలిసిందే.    దీంతో   కోల్‌కతా నుంచి దుబాయ్‌ మీదుగా స్వదేశానికి వెళ్లిన  సౌతాఫ్రికా టీమ్‌ అక్కడే  క్వారంటైన్‌లోనే ఉంది. ఐతే హోటల్‌లో ఉండగా కనికా ఎవరెవరిని కలుసుకున్నది సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని  పోలీసులు చెప్పారు. ఇప్పటికే హోటల్‌ను అధికారులు సీజ్‌ చేశారు. 


logo