శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Sports - Aug 23, 2020 , 15:28:53

‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో కలీస్‌

‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో  కలీస్‌

సౌతాఫ్రికా ఆల్‌రౌండ్‌ దిగ్గజం జాక్వెస్‌ కలీస్‌కు   ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) హాల్ ఆఫ్ ఫేమ్‌-2020లో చోటు దక్కింది. ఈ విషయాన్ని ఐసీసీ తన ట్విటర్‌ ఖాతాలో పేర్కొంది. 'టెస్టులు, వన్డేల్లో కలిపి 10,000 పరుగులు, 200 వికెట్లు తీశాడు. టెస్టుల్లో రికార్డు స్థాయిలో 23 సార్లు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డులను సొంతం చేసుకున్నాడు. సౌతాఫ్రికా తరఫున టెస్టులు, వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచాడు.' అని ఐసీసీ ట్వీట్‌ చేసింది. 

ఈ ఏడాది ముగ్గురు మాజీ అంతర్జాతీయ క్రికెటర్లను ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో  చేర్చనున్నారు. సోషల్‌మీడియా ద్వారా ఒక్కో దేశంలో నిర్ణీత సమయంలో హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న ఆటగాళ్ల పేర్లను ఐసీసీ విడుదల చేస్తున్నది.


logo