గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Feb 22, 2020 , 19:54:45

సౌతాఫ్రికాకు జరిమానా

సౌతాఫ్రికాకు జరిమానా

జోహన్నెస్‌బర్గ్‌:  తొలి టీ20లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన సౌతాఫ్రికాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్‌ కారణంగా దక్షిణాఫ్రికా జరిమానాకు గురైంది.   కెప్టెన్‌ క్వింటన్‌ డికాక్‌తో పాటు జట్టు సభ్యులకు మ్యాచ్‌ ఫీజులో 20శాతం కోత విధిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది.   నిర్ణీత సమయంలో సౌతాఫ్రికా ఒక ఓవర్‌ తక్కువగా వేయడంతో మ్యాచ్‌ రిఫరీ ఆండ్రూ పైక్రాఫ్ట్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు. తమ జట్టుకు విధించిన  జరిమానాను అంగీకరిస్తున్నట్లు డికాక్ పేర్కొన్నాడు.   ఆస్ట్రేలియా  లెగ్ స్పిన్నర్ ఆష్టన్ అగర్ హ్యాట్రిక్ సాధించడంతో ఆసీస్ ఈ మ్యాచ్‌లో 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0తో ఆధిక్యం సాధించింది. 


logo
>>>>>>