గురువారం 21 జనవరి 2021
Sports - Jan 05, 2021 , 15:59:49

గంగూలీ గుండె 20ఏండ్ల వయసులో ఉన్నంత బలంగా ఉంది!

గంగూలీ గుండె 20ఏండ్ల వయసులో ఉన్నంత బలంగా ఉంది!

 కోల్‌కతా: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ గుండె తను 20ఏండ్ల వయసులో ఉన్నప్పుడు ఉన్నంత బలంగా ఇప్పుడు ఉందని ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ దేవిశెట్టి అన్నారు. గంగూలీకి చికిత్స అందిస్తున్న తొమ్మిది మంది సభ్యుల   వైద్యబృందాన్ని వుడ్‌ల్యాండ్స్‌ హాస్పిటల్‌లో ఆమె కలిశారు. మంగళవారం జరిగిన సమావేశంలో దాదా ఆరోగ్యపరిస్థితిని సమీక్షించి తదుపరి చికిత్సపై నిర్ణయం తీసుకున్నారు. 

గంగూలీ బుధవారం డిశ్చార్జ్‌ అవుతారని, ఇకపై అతన్ని రోజూ ఇంట్లోనే వైద్యులు పర్యవేక్షిస్తారని వుడ్‌ల్యాండ్స్‌ హాస్పిటల్‌ ఎండీ, సీఈవో రూపాలి బసు తెలిపారు.  'సౌరవ్‌కు పెద్ద సమస్య ఏమీ లేదు. ఏదోఒక సమయంలో చాలా మంది భారతీయులకు ఇలాంటి సమస్య వస్తుంది. 20ఏండ్ల వయసులో ఉన్నంత బలంగా ఇప్పుడు అతని గుండె ఉంది. అతని గుండెకు ఇబ్బంది కలిగించే ఎలాంటి ప్రమాదం లేదనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. అతని హృదయం చాలా చాలా బలంగా ఉందని' డాక్టర్‌ షెట్టీ పేర్కొన్నారు. 


logo