శనివారం 16 జనవరి 2021
Sports - Jan 05, 2021 , 17:58:28

గంగూలీనే మా బ్రాండ్‌ అంబాసిడర్‌

గంగూలీనే మా బ్రాండ్‌ అంబాసిడర్‌

న్యూఢిల్లీ: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతారని అదానీ విల్మార్ డిప్యూటీ సీఈవో  అంగ్షు మల్లిక్ మంగళవారం చెప్పారు. గంగూలీ స్వల్ప గుండెనొప్పితో కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్‌ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి కంపెనీ రూపొందించిన టెలివిజన్‌ వాణిజ్య ప్రకటన ప్రసారాన్ని నిలిపివేశారు. ఆరోగ్యమైన గుండె కోసం, రోగనిరోధకశక్తిని పెంచేందుకు ఫార్చ్యూన్‌ ఆయిల్‌ను వాడాలని ఆ యాడ్‌లో  గంగూలీ చెబుతుంటారు. 

'మా ఫార్చ్యూన్‌ రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ ప్రచారకర్తగా గంగూలీ నియమితులయ్యారు.  రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ ఔషధం కాదు వంట నూనె మాత్రమేనని'  మల్లిక్‌ చెప్పారు.  'ఆహార, వంశపారంపర్య  సమస్యలతో సహా అనేక అంశాలు గుండె జబ్బులకు కారణమవుతాయి. మేం గంగూలీతో కలిసి పనిచేయడం కొనసాగిస్తాం. అతనే మా బ్రాండ్‌ అంబాసిడర్‌గా కొనసాగుతారు. మేం మళ్లీ దాదాతో చర్చించి నిర్ణయం తీసుకునే వరకు మా టీవీ వాణిజ్య ప్రకటనకు తాత్కాలిక విరామం మాత్రమే ఇస్తున్నామని' మల్లిక్‌ వివరించారు.