గురువారం 25 ఫిబ్రవరి 2021
Sports - Jan 28, 2021 , 22:55:09

దాదాకు రెండు స్టంట్‌లు.. నిల‌క‌డ‌గా గంగూలీ ఆరోగ్యం

దాదాకు రెండు స్టంట్‌లు.. నిల‌క‌డ‌గా గంగూలీ ఆరోగ్యం

కోల్‌క‌తా: ‌బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ గుండెకు పూడుకుపోయిన ర‌క్త‌నాళాల్లో గురువారం వైద్యులు రెండు స్టంట్లు అమ‌ర్చారు. అసౌక‌ర్యంగా ఉండ‌టంతో సౌర‌వ్ గంగూలీ కోల్‌క‌తాలోని ప్రైవేట్ ద‌వాఖాన‌లో అడ్మిట్ అయిన సంగ‌తి తెలిసిందే. గురువారం సాయంత్రం ఆయ‌న‌కు నిర్వ‌హించిన యాంజియోప్లాస్టీ విజ‌య‌వంత‌మైంద‌ని వైద్యులు తెలిపారు. ప్ర‌స్తుతం దాదా ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌న్నారు. 

గురువారం ప‌లు ప‌రీక్ష‌లు చేసిన త‌ర్వాత గుండెకు వెళ్లే ర‌క్త‌నాళాల్లో నిండిన పూడిక‌ను తొల‌గించ‌డానికి స్టంట్లు అమ‌ర్చాల‌ని వైద్యులు నిర్ణ‌యించారు. ఈ నెల మొద‌టి వారంలో గుండెలో అసౌక‌ర్యంగా ఉండ‌టంతో తొలిసారి ద‌వాఖాన‌లో చేరిన గంగూలీకి వైద్య చికిత్స నిర్వ‌హించిన వైద్యులు అప్పుడే స్టంట్లు వేయాల‌ని తీర్మానించారు. స‌మ‌స్య తీవ్రంగా ఉన్న ఒకచోట స్టంట్ అమ‌ర్చారు. త‌ర్వాత ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉండ‌టంతో స్టంట్లు వేయ‌డం వాయిదా వేశారు. బుధ‌వారం మ‌ళ్లీ అస్వ‌స్థ‌త‌కు గురి కావ‌డంతో దాదా ద‌వాఖాన‌లో చేరారు. 

గంగూలీ ద‌వాఖాన‌లో చేరిన సంగ‌తి తెలియ‌డంతో ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ హాస్పిట‌ల్‌కు వెళ్లి ఆయ‌న‌ను ప‌రామ‌ర్శించారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి గురించి వైద్యుల‌ను అడిగి తెలుసుకున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo