శుక్రవారం 04 డిసెంబర్ 2020
Sports - Nov 11, 2020 , 11:54:30

ప్లేయ‌ర్ల‌కు థ్యాంక్స్ చెప్పిన గంగూలీ..

ప్లేయ‌ర్ల‌కు థ్యాంక్స్ చెప్పిన గంగూలీ..

హైద‌రాబాద్‌: దుబాయ్‌లో ఐపీఎల్ టోర్నీని బ‌యో బ‌బూల్ వాతావ‌ర‌ణంలో నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే.  51 రోజుల పాటు సాగిన టోర్న‌మెంట్ మంగ‌ళ‌వారం ముగిసింది.  క‌రోనా వైర‌స్ ఆంక్ష‌లు ఉన్న నేప‌థ్యంలో టోర్నీని దుబాయ్‌, షార్జా స్టేడియాల్లో నిర్వ‌హించారు. అయితే ఆ టోర్నీ నిర్వ‌హించిన తీరుపై  బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ కామెంట్ చేశారు.  టోర్నీని స‌క్సెస్ చేసిన ఆఫీసు బేర‌ర్లతో పాటు ప్ర‌తి ఐపీఎల్ జ‌ట్టు ప్లేయ‌ర్‌కు వ్య‌క్తిగ‌తంగా థ్యాంక్స్ చెబుతున్న‌ట్లు సౌర‌వ్ త‌న ట్వీట్‌లో వెల్ల‌డించారు.  అత్యంత క‌ట్టుదిట్ట‌మైన బ‌యోబ‌బూల్ వాతావ‌ర‌ణంలో .. ఐపీఎల్ టోర్న‌మెంట్‌ను నిర్వ‌హించ‌డం అద్భుత‌మ‌న్నారు.  మాన‌సికంగా టోర్నీ నిర్వ‌హ‌ణ క‌ష్ట‌మ‌ని, కానీ మీరు చూపిన దీక్ష భార‌త క్రికెట్ ఖ్యాతిని పెంపొందిస్తుంద‌ని క్రికెట‌ర్ల‌ను గంగూలీ మెచ్చుకున్నారు. ఈ యేటి ఐపీఎల్ టోర్నీని ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు గెలుచుకున్న‌ది.

క‌రోనా ఆంక్ష‌ల నేప‌థ్యంలో స్టేడియాల్లోకి ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తించ‌లేదు.  టోర్నీ ప్రారంభానికి ముందు కూడా ప్లేయ‌ర్లు దుబాయ్‌కి నెల రోజుల ముందే చేరుకున్నారు.  త‌మ త‌మ హోట‌ళ్ల‌లో ప్లేయ‌ర్లు క్వారెంటైన్‌లో ఉన్న త‌ర్వాత‌.. ప్రాక్టీసు ప్రారంభించారు. ఆ త‌ర్వాతే షార్జా, దుబాయ్ ప్ర‌భుత్వ నియ‌మావ‌ళి ప్ర‌కారం.. ఐపీఎల్ టోర్నీ నిర్వ‌హించారు.  వాస్త‌వానికి ఇండియాలో జ‌ర‌గాల్సిన టోర్నీని.. లాక్‌డౌన్ ఆంక్ష‌ల నేప‌థ్యంలో దుబాయ్‌కి మార్చారు.  టోర్నీ వేదిక మార్పుకు భార‌త ప్ర‌భుత్వం కూడా అంగీకారం తెలిపిన విష‌యం తెలిసిందే. క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన త‌ర్వాత‌నే ప్లేయ‌ర్లు అంతా దుబాయ్ వెళ్లారు. బంతికి ఉమ్మి రాయ‌వ‌ద్దు అన్న నిబంధ‌న‌ను ప్లేయ‌ర్లు పాటించారు.