ఆదివారం 24 జనవరి 2021
Sports - Jan 04, 2021 , 17:11:54

కోలుకున్న గంగూలీ జనవరి 6న డిశ్చార్జ్‌!

కోలుకున్న గంగూలీ జనవరి 6న  డిశ్చార్జ్‌!

కోల్‌కతా: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. గంగూలీ స్వల్ప గుండెపోటుతో శనివారం కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్‌ ఆస్పత్రిలో చేరగా ఆయనకు యాంజియోప్లాస్టీ చేశారు.  గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉంది త్వరగా కోలుకుంటున్నారని, బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యే అవకాశం ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 

డాక్టర్‌ దేవిశెట్టి మంగళవారం గంగూలీ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించనున్నారు. అనంతరం  వైద్య బృందంతో సమావేశంలో దాదాకు అందించే తదుపరి చికిత్స, డిశ్చార్జ్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే 9 మంది సభ్యుల వైద్య బృందం సమావేశమై గంగూలీ కుటుంబ సభ్యులతో చర్చించింది.    


logo