శనివారం 26 సెప్టెంబర్ 2020
Sports - Sep 10, 2020 , 01:40:45

దుబాయ్‌లో దాదా

దుబాయ్‌లో దాదా

న్యూఢిల్లీ:  ఐపీఎల్‌ 13వ సీజన్‌ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ యూఏఈ వెళ్లాడు. ముఖానికి మాస్క్‌, ఫేస్‌ షీల్డ్‌ పెట్టుకొని బుధవారం ప్రత్యేక విమానంలో దాదా దుబాయ్‌ చేరుకున్నాడు. ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ‘ఆరు నెలల తర్వాత తొలిసారి విమానంలో ప్రయాణిస్తున్నా. దుబాయ్‌ వెళుతున్నా. జీవితం విచిత్రంగా మారిపోయింది’ అని గంగూలీ రాసుకొచ్చాడు. ఐపీఎల్‌ చైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ సహా మరికొందరు అధికారులు ఇప్పటికే యూఏఈలో ఉన్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో బయో సెక్యూర్‌ వాతావరణంలో  ఐపీఎల్‌ ఈ నెల 19న ప్రారంభం కానుంది.  


logo