శనివారం 06 మార్చి 2021
Sports - Jan 27, 2021 , 18:37:30

గంగూలీ చెకప్‌ కోసమే వచ్చారు: అపోలో

గంగూలీ చెకప్‌ కోసమే వచ్చారు: అపోలో

కోల్‌కతా: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తన గుండె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికే ఆస్పత్రికి వచ్చారని కోల్‌కతాలోని అపోలో హాస్పిటల్స్‌ తెలిపింది. ఛాతీ నొప్పి, అసౌకర్యంగా ఉండటంతో గంగూలీ బుధవారం మధ్యాహ్నం మళ్లీ ఆస్పత్రికి వచ్చిన విషయం తెలిసిందే. 

'48ఏండ్ల గంగూలీ తన గుండె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి ఆస్పత్రికి వచ్చారు. అతని ఆరోగ్యం నిలకడగా ఉందని' అపోలో ఒక ప్రకటనలో తెలిపింది.  గుంగూలీ ఈసీజీ రిపోర్ట్‌లో వైద్యులు స్వల్ప మార్పులు గుర్తించినట్లు తెలిసింది.

మంగళవారం సాయంత్రం నుంచి గంగూలీకి ఆరోగ్యం బాగాలేదని అతని ఫ్యామిలీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. బుధవారం కూడా అలాంటి ఇబ్బందే ఉండటంతో ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (ఈసీజీ) నిర్వహించారు. అందులో కొన్ని మార్పులును గుర్తించారని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. 

VIDEOS

logo