బుధవారం 01 ఏప్రిల్ 2020
Sports - Mar 07, 2020 , 01:46:39

షెడ్యూల్‌ ప్రకారమే ఐపీఎల్‌

 షెడ్యూల్‌ ప్రకారమే ఐపీఎల్‌

కోల్‌కతా: ఈ నెల 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్‌ 13వ సీజన్‌ షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ మరోసారి స్పష్టంచేశాడు. కరోనా వైరస్‌ వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని శుక్రవారం వెల్లడించాడు. ‘ఐపీఎల్‌ కచ్చితంగా జరుగుతుంది. ప్రపంచంలో క్రికెట్‌ టోర్నీలన్నీ జరుగుతున్నాయి. వెస్టిండీస్‌ జట్టు శ్రీలంకలో ఉంది. దక్షిణాఫ్రికా భారత్‌కే వస్తున్నది. ఎలాంటి సమస్య లేదు. క్రికెట్‌ జట్లు ప్రపంచ వ్యాప్తంగా పర్యటిస్తున్నాయి’ అని దాదా పేర్కొన్నాడు. వైద్య బృందాలను సంప్రదించి కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలను తీసుకుంటామని గంగూలీ చెప్పాడు. 
logo
>>>>>>