బుధవారం 08 జూలై 2020
Sports - May 26, 2020 , 00:21:20

దాదా కొనసాగడం కష్టం: గుప్తా

దాదా కొనసాగడం కష్టం: గుప్తా

న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీని మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ జీవితకాల సభ్యుడు సంజీవ్‌ గుప్తా హెచ్చరించాడు. ఒకసారి ఐసీసీ  బోర్డు కు నామినేట్‌ అయితే బీసీసీఐ చీఫ్‌గా దాదా కొనసాగే అవకాశం కోల్పోతాడని గుప్తా పేర్కొన్నాడు. బీసీసీఐ నిబంధనల్లో ఇది స్పష్టంగా ఉందని తెలుపుతూ గంగూలీతో సహా బోర్డు సభ్యులకు గుప్తా ఈమెయిల్‌ పంపాడు. 

సుప్రీం కోర్టుకు బీసీసీఐ: గతేడాది జరిగిన బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం(ఎస్‌జీఎమ్‌)లో తీసుకున్న నిర్ణయాల అమలుపై బోర్డు మరోమారు సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

నేటి నుంచి ఐసీసీ భేటీ: మంగళవారం నుంచి మూడు రోజుల ఐసీసీ కీలక సమావేశాలు జరుగబోతున్నాయి. ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌తో పాటు చైర్మన్‌ పదవికి నామినేషన్‌, ఎన్నిక తేదీ, ఉమ్మిపై నిషేధం తదితర అంశాలు చర్చకు రానున్నాయి. 


logo