శనివారం 04 జూలై 2020
Sports - Jun 27, 2020 , 00:41:45

దాదా-ద్రవిడ్‌ జోడీ కీలకం: లక్ష్మణ్‌

దాదా-ద్రవిడ్‌ జోడీ కీలకం: లక్ష్మణ్‌

న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) చీఫ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ భాగస్వామ్యం రానున్న కాలంలో భారత క్రికెట్‌కు ఎంతో కీలకం కానుందని టీమ్‌ఇండియా దిగ్గజం వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నాడు. ఆటగాళ్లుగా తమ భాగస్వామ్యంతో భారత్‌కు ఎన్నో విజయాలు అందించిన వీరు.. ఇప్పుడు కూడా కలిసికట్టుగా పనిచేస్తే అద్భుతాలు జరుగుతాయని శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డాడు. ‘బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్‌, ఎన్‌సీఏ చీఫ్‌గా ద్రవిడ్‌ ఉండడం మంచి విషయం. ప్రతి ఫార్మాట్‌లోనూ టీమ్‌ఇండియా అగ్రస్థానంలో నిలువాలంటే ఈ ఇద్దరి భాగస్వామ్యం ఎంతో ముఖ్యం. జట్టు కెప్టెన్‌ కూడా ఎంతో కీలకం’అని లక్ష్మణ్‌ అన్నాడు


logo