శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Feb 23, 2020 , 00:23:11

సూపర్‌ సోఫీ

సూపర్‌ సోఫీ
  • రికార్డు అర్ధశతకంతో కివీస్‌ను గెలిపించిన కెప్టెన్‌

పెర్త్‌: కెప్టెన్‌ సోఫీ డివైన్‌ (55 బంతుల్లో 75 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ అర్ధశతకంతో చెలరేగడంతో మహిళల టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ జట్టు శుభారంభం చేసింది. శనివారం జరిగిన పోరులో న్యూజిలాండ్‌ 7 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. మొదట లంక నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. కెప్టెన్‌ చమారి ఆటపట్టు జయంగని (41; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), మాధవి (27 నాటౌట్‌) ఆకట్టుకున్నారు. కివీస్‌ బౌలర్లలో హేలీ జెన్సన్‌కు 3, అమేలి కెర్‌క్రు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్‌.. సోఫీ డివైన్‌ రెచ్చిపోవడంతో 17.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 131 పరుగులు చేసింది. ఈ ఫార్మాట్‌లో సోఫీకు ఇది వరుసగా ఆరో అర్ధశతకం కావడం విశేషం.


థాయ్‌లాండ్‌పై విండీస్‌ విజయం

ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన థాయ్‌లాండ్‌ అమ్మాయిలకు ప్రతికూల ఫలితం ఎదురైంది. శనివారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌ లో థాయ్‌ జట్టు  7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన థాయ్‌లాండ్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 78 పరుగులు చేసింది. నన్నపత్‌ కొన్‌చరోనెకై (33) టాప్‌ స్కోరర్‌. విండీస్‌ కెప్టెన్‌ స్ట్టెఫానీ టేలర్‌ (3/13) ధాటికి థాయ్‌లాండ్‌ ప్లేయర్లలో ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. అనంతరం లక్ష్య ఛేదనలో విండీస్‌ 16.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది. స్టెఫానీ (26 నాటౌట్‌), షమైన్‌ (25 నాటౌట్‌) రాణించారు.


నేటి మ్యాచ్‌

ఇంగ్లండ్‌ X దక్షిణాఫ్రికా

వేదిక:  పెర్త్‌ సా. 4.30


logo