శుక్రవారం 22 జనవరి 2021
Sports - Dec 17, 2020 , 18:40:42

సోనీ పంట పండింది.. ఒక్క సిరీస్‌తో 400 కోట్ల ఆదాయం

సోనీ పంట పండింది.. ఒక్క సిరీస్‌తో 400 కోట్ల ఆదాయం

న్యూఢిల్లీ: ప‌్ర‌స్తుతం జ‌రుగుతున్న ఇండియా, ఆస్ట్రేలియా సిరీస్ బ్రాడ్‌కాస్ట‌ర్‌గా ఉన్న సోనీ పిక్చ‌ర్స్ నెట్‌వ‌ర్క్ (ఎస్‌పీఎన్‌) పంట పండింది. ఈ టూర్‌ ద్వారా సోనీ టీవీ, ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన సోనీలివ్ సంయుక్తంగా రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్ల వ‌ర‌కు ఆదాయం పొందే అవ‌కాశాలు ఉన్నాయి. టూర్‌లో భాగంగా టీమిండియా మొత్తం 3 వ‌న్డేలు, 3 టీ20లు, 4 టెస్టులు ఆడ‌నున్న సంగ‌తి తెలిసిందే. న‌వంబ‌ర్ 27న ప్రారంభ‌మైన ఈ టూర్‌.. జ‌న‌వ‌రిలో ముగుస్తుంది. ఈ టూర్‌కు అభిమానుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది. పైగా సోనీ నెట్‌వ‌ర్క్ ఇంగ్లిష్‌తోపాటు హిందీ, త‌మిళం, తెలుగుల్లో క‌లిపి మొత్తం ఆరు చానెళ్ల‌లో మ్యాచ్‌ల‌ను ప్ర‌సారం చేస్తోంది. దీంతో వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల ద్వారా భారీ ఆదాయం వ‌స్తోంది. వ‌న్డే, టీ20 సిరీస్‌ల‌కు ప్ర‌ముఖ బ్రాండ్ల‌యిన మోండెలెజ్‌, నెట్‌ఫ్లిక్స్‌, డెటాల్ స్పాన్స‌ర్లుగా వ్య‌వ‌హ‌రించాయి. 

టీవీ రేటింగ్‌ల‌ను చూసే బార్క్ అందించిన డేటా ప్ర‌కారం.. మూడు వ‌న్డేలు క‌లిపి 1100 కోట్ల వ్యూయింగ్ మిన‌ట్స్ సంపాదించాయి. ఇక టీ20ల‌కు మొత్తంగా 850 కోట్ల వ్యూయింగ్ మిన‌ట్స్ వ‌చ్చాయి. ఈ మ‌ధ్య పాకిస్థాన్‌తో ఇండియా మ్యాచ్‌లు లేక‌పోవ‌డంతో.. ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్‌ల‌కు ఆ స్థాయి స్పంద‌న వ‌స్తోందని మాడిస‌న్ మీడియా ఒమేగా సీఈవో దినేష్ రాథోడ్ చెప్పారు. చాలా వ‌ర‌కు మ్యాచ్‌లు మ‌ధ్యాహ్నం త‌ర్వాత ఉండ‌టం వ‌ల్ల కూడా వ్యూయ‌ర్‌షిప్ పెరిగింద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ఐపీఎల్ 20 నుంచి 30 శాతం ఎక్కువ వ్యూయ‌ర్‌షిప్ పొంద‌డంతో దాని ప్ర‌భావం మిగ‌తా సిరీస్‌ల‌పై కూడా ప‌డింది. ఈ టూర్ కోసం సోనీ 15 మంది స్పాన్స‌ర్ల‌ను పొంద‌డం విశేషం. అందులో మారుతీ సుజుకీ, మై11 స‌ర్కిల్‌, బైజూస్‌, విమ‌ల్ పాన్ మ‌సాలా, రిల‌యెన్స్ జియో, ఎస్‌బీఐ మ్యూచువ‌ల్ ఫండ్స్‌, నెట్‌ఫ్లిక్స్‌, ఎంఆర్ఎఫ్‌, డెటాల్‌లాంటి బ్రాండ్స్ అందులో ఉన్నాయి. 


logo