హైదరాబాద్, ఆట ప్రతినిధి: క్రీడా కార్యక్రమాలను ప్రేక్షకులకు మరింత చేరువ చేసేందుకు సోనీ నెట్వర్క్ సంస్థ సిద్ధమైంది. ఈ నెలలో ఫుట్‌బాల్ ప్రేక్షకులను అలరించనున్న యూరో, కోపా అమెరికా కప్ టోర్నీలను ఆరు భారతీయ భాషల్లో ప్రసారం చేయనుంది. ఇందులో ఇంగ్లిష్, హిందీ, బెంగాలీ, మళయాళీ భాషలతో పాటు కొత్తగా తెలుగు, తమిళంలో కవరేజీకి ముందుకొచ్చింది. ఈనెల 11న మొదలయ్యే ప్రతిష్ఠాత్మక యూరో కప్‌లో మొత్తం 24 జట్లు బరిలోకి దిగనున్నాయి. ప్రతి మ్యాచ్‌ను తాజా, మాజీ ప్లేయర్లు తమదైన శైలిలో విశ్లేషించనున్నారు. భారత్ నుంచి బైచుంగ్ భూటియా, సునీల్ ఛెత్రీ, గుర్‌ప్రీత్‌సింగ్ సంధు, సందేశ్, రాబిన్‌సింగ్ తమ అనుభవాలను పంచుకోనున్నారు.