మంగళవారం 31 మార్చి 2020
Sports - Feb 27, 2020 , 00:39:44

సాక్షి మాలిక్‌ ఒలింపిక్స్‌ ఆశలు గల్లంతు!

 సాక్షి మాలిక్‌ ఒలింపిక్స్‌ ఆశలు గల్లంతు!
  • సోనమ్‌ చేతిలో అనూహ్య ఓటమి

లక్నో: భారత యు వ రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ టోక్యో ఒలింపిక్స్‌ ఆశలు దాదా పు గల్లంతయ్యా యి. బుధవారం జరిగిన 62 కిలోల తుది పోరులో 18 ఏండ్ల సోనమ్‌ మాలిక్‌..  సాక్షిపై అనూహ్య విజయం సొంతం చేసుకుంది. ఒక దశలో 1-2తో వెనుకంజలో ఉన్నా.. బౌట్‌ పూర్తి కావడానికి మరో నిమిషముందనగా ఒక్కసారిగా పుంజుకున్న సోనమ్‌..సాక్షిని మట్టికరిపించింది. అంతుముందు జరిగిన వేర్వేరు బౌట్లలో సరితా మోర్‌పై 3-1తో ఓడించడంతో పాటు రాధికపై అలవోకగా గెలిచింది. సోనమ్‌.. వచ్చే నెల 27 నుంచి మొదలయ్యే ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌ టోర్నీకి ఎంపికైంది. ఇందులో ఫైనల్‌ చేరిన వారు టోక్యో ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధిస్తారు. 


logo
>>>>>>