మంగళవారం 31 మార్చి 2020
Sports - Feb 06, 2020 , 00:31:12

క్యాబ్‌ అధ్యక్షుడిగా దాల్మియా కుమారుడు

క్యాబ్‌ అధ్యక్షుడిగా దాల్మియా కుమారుడు

కోల్‌కతా: కోల్‌కతా క్రికెట్‌ సంఘం(క్యాబ్‌) అధ్యక్షుడిగా బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, దివంగత జగ్మోహన్‌ దాల్మియా కుమారుడు అవిషేక్‌ బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 38ఏండ్లకే అధ్యక్ష పీఠంలో కూర్చొని, ఈ పదవి దక్కించుకున్న పిన్నవయస్కుడిగా నిలిచాడు. కాగా,  బీసీసీఐ ప్రస్తుత అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ సోదరుడు స్నేహాశిష్‌ గంగూలీ క్యాబ్‌ ప్రధాన కార్యదర్శి స్థానాన్ని దక్కించుకున్నాడు. ఎన్నిక అనంతరం ఇద్దరినీ సౌరవ్‌ అభినందించాడు. అంతకుముందు ప్రధాన కార్యదర్శి బాధ్యతలను నిర్వర్తించిన అవిషేక్‌... జస్టిస్‌ లోధా సిఫార్సుల మేరకు క్యాబ్‌ అధ్యక్ష పదవిలో 2021 నవంబర్‌ 6వరకే కొనసాగే అవకాశం ఉంది. 22నెలల తర్వాత క్యాబ్‌లో ఆరేండ్ల పదవీ బాధ్యతలు పూర్తికానుండడంతో అతడు కూలింగ్‌ పీరియడ్‌ నిబంధన ప్రకారం పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. 


logo
>>>>>>