గురువారం 09 జూలై 2020
Sports - May 13, 2020 , 21:30:01

డ్రెస్సింగ్ రూమ్‌లో ఫుల్ జోష్: జెమీమా రోడ్రిగ్స్‌

డ్రెస్సింగ్ రూమ్‌లో ఫుల్ జోష్:  జెమీమా రోడ్రిగ్స్‌

న్యూఢిల్లీ:  భార‌త మ‌హిళ‌ల క్రికెట్ జ‌ట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో స‌దా అహ్లాద‌క‌ర‌మైన వాతావ‌రణం ఉంటుంద‌ని యువ ప్లేయ‌ర్ జెమీమా రోడ్రిగ్స్ చెప్పింది. సీనియ‌ర్‌, జూనియ‌ర్ అనే తేడా లేకుండా అంతా క‌లివిడిగా ఉంటామ‌ని పేర్కొంది. మ‌న‌దేశంలో మ‌హిళ‌ల కోసం ప్ర‌త్యేకంగా ఐపీఎల్ నిర్వ‌హించ‌డం అమ్మాయిల ఆట‌కు మేలు చేస్తుంద‌ని ఆమె పేర్కొంది. 

`ఆస్ట్రేలియాలో అమ్మాయిల కోసం ప్ర‌త్యేకంగా డ‌బ్ల్యూబీబీఎల్, ఇంగ్లండ్‌లో కియా సూప‌ర్ లీగ్ నిర్వ‌హిస్తున్నారు. అదేవిధంగా మ‌న‌దేశంలో మ‌హిళ‌ల ఐపీఎల్ ప్ర‌వేశ పెడితే ఆట‌కు అద‌న‌పు ప్ర‌యోజనం చేకూర‌డం ప‌క్కా. అయితే అది విజ‌యవంత‌మ‌వుతుందా అంటే నా దగ్గ‌ర స‌మాధానం లేదు. వ‌చ్చే ఏడాది జ‌రుగనున్న వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ నెగ్గేందుకు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతాం. మిథాలీ దీ, జుల‌న్ దీదీకి దాదాపు ఇదే ఆఖ‌రి ప్ర‌పంచ‌క‌ప్‌.. వారు అమ్మాయిల క్రికెట్ కోసం ఎంతో చేశారు. ఆ రోజు ఎన్నో క‌ష్టాలు ఎదుర్కున్నారు కాబ‌ట్టే వాటి ఫ‌లితాల‌ను ప్ర‌స్తుతం మేం ఆస్వాదించ‌గ‌లుగుతున్నాం. డ్రెస్సింగ్ రూమ్ వాతావ‌ర‌ణం విష‌యానికి వ‌స్తే.. మేమంతా చాలా స‌ర‌దాగా ఉంటాం. అందుకే ఎప్పుడూ ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణ‌మే క‌నిపిస్తుంది`అని రోడ్రిగ్స్ చెప్పుకొచ్చింది. 19 ఏండ్ల వ‌య‌సులోనే ఇప్ప‌టికి రెండు ప్ర‌పంచ‌క‌ప్‌ల్లో దేశానికి ప్రాతినిధ్యం వ‌హించిన రోడ్రిగ్స్‌.. అప్పుడ‌ప్పుడు త‌నే జ‌ట్టులో సీనియ‌ర్ ప్లేయ‌ర్‌లా భావిస్తానని పేర్కొంది.logo