బుధవారం 08 జూలై 2020
Sports - Apr 18, 2020 , 17:25:02

మోసగాళ్లతో అలాగే ప్రవర్తిస్తా: అఫ్రిదికి గంభీర్ పంచ్​

మోసగాళ్లతో అలాగే ప్రవర్తిస్తా: అఫ్రిదికి గంభీర్ పంచ్​

న్యూఢిల్లీ: పాకిస్థాన్​ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదిపై టీమ్​ఇండియా మాజీ స్టార్ ఓపెనర్​ గౌతమ్ గంభీర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇటీవల గంభీర్​తో పాటు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్ వార్న్​ గురించి అఫ్రిది నోరుజారాడు. “గంభీర్​ ప్రవర్తనలో సమస్య ఉంది. అతడికి వ్యక్తిత్వం లేదు. రికార్డులు లేవు, కానీ ఎక్కువ ఆటిట్యూడ్ ఉంది” అని అఫ్రిది అన్నాడు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహించిన గంభీర్​.. అఫ్రిదికి తగిన రీతిలో బుద్ధిచెప్పాలని నిశ్చయించుకొని శనివారం ఓ ట్వీట్ చేశాడు.  

“అతడి వయస్సే గుర్తుంచుకోలేని ఓ వ్యక్తి(అఫ్రిది)కి నా రికార్డులెలా గుర్తుంటాయి. షాహిద్ అఫ్రిది నీకు ఓ విషయం గుర్తు చేస్తా. 2007 ప్రపంచకప్​(టీ20) ఫైనల్​, భారత్ – పాకిస్థాన్​ మ్యాచ్​లో గంభీర్​ 54బంతుల్లో 75పరుగులు చేశాడు. మొదటి బంతికే అఫ్రిది డకౌట్ అయ్యాడు. ముఖ్యమైన విషయం: మేం కప్పు గెలిచాం. అబద్ధాల కోరు, మోసగాళ్లు, అవకాశవాదుల పట్ల నా ప్రవర్తన దురుసుగానే ఉంటుంది ” అని గంభీర్ ట్వీట్ చేశాడు. 2007లో గువహటి వేదికగా జరిగిన వన్డేలో గంభీర్​, అఫ్రిది మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఓ దశలో అఫ్రిది ఏదో అనగా గంభీర్ అతడి వైపు దూసుకెళ్లి.. కండ్లలోకి చూస్తూ గట్టిగా సమాధానమిచ్చాడు. దీంతో అఫ్రిది తగ్గాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది.  


logo