బుధవారం 02 డిసెంబర్ 2020
Sports - Oct 10, 2020 , 00:49:42

ప్రభుత్వ ఉద్యోగంలా ఫీలవుతున్నారు

ప్రభుత్వ ఉద్యోగంలా ఫీలవుతున్నారు

న్యూఢిల్లీ:  కోల్‌కతాతో మ్యాచ్‌ను చేజార్చుకున్న చెన్నై తీరుపై సెహ్వాగ్‌ సెటైర్లు వేసిన తీరు నవ్వు తెప్పిస్తున్నది. గెలిచే మ్యాచ్‌ను బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో చెన్నై ఓటమి కొని తెచ్చుకోవడంపై సెహ్వాగ్‌ స్పందిస్తూ ‘కోల్‌కతా నిర్దేశించిన లక్ష్యం పెద్దదేమి కాదు. కానీ జాదవ్‌, జడేజా బంతులను వృథా చేయడం ఓటమికి కారణం. కొంతమంది చెన్నై బ్యాట్స్‌మెన్‌ ప్రభుత్వం ఉద్యోగం లెక్క ఫీలవుతున్నారు. ఆడినా, ఆడకపోయినా జీతం వస్తుందిలే అన్న ధీమాతో ఉన్నారు’ అని అన్నాడు.