సోమవారం 18 జనవరి 2021
Sports - Jan 10, 2021 , 00:24:16

సిరాజ్‌, బుమ్రాపై జాత్యహంకార వ్యాఖ్యలు

సిరాజ్‌, బుమ్రాపై జాత్యహంకార వ్యాఖ్యలు

సిడ్నీ టెస్టులో మరోసారి జాత్యహంకార వ్యాఖ్యలు చర్చకు వచ్చాయి. 2007-08 పర్యటనలో జరిగిన ‘మంకీగేట్‌' ఉదంతాన్ని గుర్తుచేస్తూ.. కొంద రు ఆకతాయిలు భారత ఆటగాళ్లను దుర్భాషలాడారు. మూడో రోజు బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న జస్ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ సిరాజ్‌లను ఉద్దేశిస్తూ కొందరు ఆసీస్‌ అభిమానులు అహంకార పూరిత వ్యాఖ్యలు చేశారు. దీంతో బీసీసీఐ ఈ అంశంపై ఐసీసీ మ్యాచ్‌ రిఫరీ డేవిడ్‌ బూన్‌కు ఫిర్యాదు చేసింది. మూడో రోజు ఆట ముగిసిన అనంతరం కెప్టెన్‌ రహానే, అశ్విన్‌ ఈ విషయంపై అంపైర్లు పాల్‌ రైఫిల్‌, విల్సన్‌, సెక్యూరిటీ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. దీనిపై విచారణ చేపడుతున్న ఐసీసీ.. సిరాజ్‌తో మాట్లాడి మరిన్ని వివరాలు సేకరించింది. కాగా.. మద్యం సేవించిన ఓ అభిమాని సిరాజ్‌ను ఉద్దేశిస్తూ కోతి అన్నాడని బీసీసీఐ ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.