బుధవారం 08 జూలై 2020
Sports - Apr 18, 2020 , 12:37:35

బాధ్యతగా ఉండండి: పాక్ క్రికెటర్లకు తన్వీర్ సూచన

బాధ్యతగా ఉండండి: పాక్ క్రికెటర్లకు తన్వీర్ సూచన

కరాచీ: సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని పాకిస్థాన్ క్రికెటర్లకు ఆ దేశ పేసర్ సోహెల్ తన్వీర్ సూచించాడు. కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యల వల్ల పాక్ ఆటగాళ్లతో పాటు బోర్డుకు ఇబ్బందికరంగా మారుతున్నదని అభిప్రాయపడ్డాడు.

“మా మాజీ, ప్రస్తుత క్రికెటర్లు సోషల్ మీడియాను మరింత బాధ్యతగా ఆలోచనాయుతంగా వినియోగించాలి. కొందరు చేస్తున్న వ్యాఖ్యల వల్ల పాకిస్థాన్ క్రికెట్​ పట్ల ప్రతికూలభావం పెరుగుతున్నది. నేరుగా పంచుకోలేని మాటలను, అభిప్రాయాలను ఎవరూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించకండి. ఎందుకంటే మరోసారి కలవాల్సి వచ్చినప్పుడు ఇద్దరికీ ఎంతో ఇబ్బంది కరంగా ఉంటుంది” అని తన్వీర్ అభిప్రాయపడ్డాడు.

హెడ్​కోచ్​గా, చీఫ్ సెలెక్టర్​గా మిస్వాఉల్ హక్​ను నియమించడంపై పాక్ మాజీ ఆటగాడు మహమ్మద్ యూసుఫ్​ పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతే. దీంతో ​ మాజీ స్పిన్నర్ దానిష్ కనేరియా, ఫైజల్ ఇక్బాల్​.. యూసుఫ్​పై సోషల్ మీడియా వేదికగా ఎదురుదాడికి దిగారు. ఈ నేపథ్యంలో పాక్ క్రికెటర్లు సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండాలని తన్వీర్ సూచించాడు. 

తాజావార్తలు


logo