ఆదివారం 23 ఫిబ్రవరి 2020
స్మృతి మందాన@4

స్మృతి మందాన@4

Feb 14, 2020 , 19:06:10
PRINT
స్మృతి మందాన@4

టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాట్స్‌వుమన్‌ స్మృతి మందాన ఐసీసీ విమెన్స్‌ టీ20 ర్యాంకింగ్స్‌లో అదరగొట్టింది.

దుబాయ్‌:  టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాట్స్‌వుమన్‌  స్మృతి మందాన ఐసీసీ విమెన్స్‌ టీ20 ర్యాంకింగ్స్‌లో అదరగొట్టింది.   మహిళల టీ20 బ్యాటర్స్‌ ర్యాంకింగ్స్‌లో మందాన ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి నాలుగో ర్యాంకు సాధించింది. మందాన వన్డేల్లోనూ నాలుగులో కొనసాగుతుండటం విశేషం. యువ క్రీడాకారిణి జెమిమా రోడ్రిగ్స్‌ ఏడో స్థానానికి పడిపోయింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌  తొమ్మిదో ర్యాంకుతో తన స్థానాన్ని నిలబెట్టుకుంది. బౌలర్ల జాబితాలో పూనమ్‌ యాదవ్‌ ఆరు ర్యాంకులు పడిపోయి టాప్‌-10లో చోటు కోల్పోయింది.  రాధా యాదవ్‌, దీప్తి శర్మ సంయుక్తంగా నాలుగులో ఉండగా.. పూనమ్‌ 12వ ర్యాంకుతో సరిపెట్టుకుంది.  విమెన్స్‌ టీ20 ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా..భారత అమ్మాయిల జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. 


logo