శనివారం 05 డిసెంబర్ 2020
Sports - Oct 08, 2020 , 18:26:00

పడిపోయిన స్మృతి మందాన ర్యాంకు

పడిపోయిన స్మృతి మందాన ర్యాంకు

దుబాయ్‌: టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాట్స్‌వుమన్‌  స్మృతి మందాన(732 పాయింట్లు) ఐసీసీ విమెన్స్‌ వన్డే  ర్యాంకింగ్స్‌లో ఈ సారి ఒక స్థానం కోల్పోయి నాలుగో ర్యాంకులో  నిలిచింది.  నాలుగో ర్యాంకుకు పడిపోయింది. బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో  భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ పదో స్థానంలో కొనసాగుతోంది.  కరోనా కారణంగా గత ఆరు నెలల నుంచి  భారత అమ్మాయిలు  ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు.  ఆస్ట్రేలియా కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌(749 పాయింట్లు) ఏకంగా నాలుగు ర్యాంకులు ఎగబాకి మళ్లీ అగ్రస్థానాన్ని  అధిరోహించింది.

వెస్టిండీస్‌ క్రీడాకారిణి స్టఫానీ టేలర్‌, ఆసీస్‌ స్టార్‌ ప్లేయర్‌ అలీస్సా హీలీ వరుసగా రెండు, మూడు ర్యాంకుల్లో నిలిచారు.  న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను ఆసీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసిన విషయం తెలిసిందే. సిరీస్‌ విజయంలో ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ కీలక పాత్ర పోషించారు. కివీస్‌ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ  పరుగుల వరద పారించి రేటింగ్‌ పాయింట్లను మెరుగుపరచుకున్నారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.