మంగళవారం 19 జనవరి 2021
Sports - Jan 10, 2021 , 10:26:45

క‌లిస్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన స్టీవ్‌ స్మిత్‌

క‌లిస్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన స్టీవ్‌ స్మిత్‌

సిడ్నీ: ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండ‌ర్ జాక్వెస్ క‌లిస్‌ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. ఒకే టెస్టు మ్యాచ్‌లో అత్య‌ధిక సార్లు ఒక సెంచ‌రీ, ఒక‌ హాఫ్ సెంచ‌రీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా స్మిత్ నిలిచాడు. భార‌త్‌-ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జ‌రుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో స్మిత్ ఫీట్ సాధించాడు. ఆట నాలుగో రోజైన ఆదివారం 81 ప‌రుగుల వ‌ద్ద అవుటైన స్మిత్.. అంత‌కుము ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో 131 పరుగులు చేశాడు. దీంతో 10 సార్లు ఒకే టెస్టు మ్యాచ్‌లో సెంచ‌రీ, హాఫ్ సెంచ‌రీ కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా స్మిత్ రికార్డు సృష్టించాడు. 

ఇప్ప‌టివ‌ర‌కు ద‌క్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండ‌ర్ క‌లిస్ పేరిట ఈ రికార్డు ఉండేది. ఆయ‌న 9 సార్లు ఒకే టెస్టు మ్యాచ్‌లో సెంచ‌రీ, హాఫ్ సెంచ‌రీ చేశాడు. ఆ త‌ర్వాత మూడో స్థానంలో ఇంగ్లండ్ జ‌ట్టు మాజీ కెప్టెన్ అలిస్ట‌ర్ కుక్ ఉన్నాడు. ఆయ‌న 8 సార్లు ఒకే టెస్టులో సెంచ‌రీ, హాఫ్ సెంచరీ సాధించాడు. ఇక ఆ త‌ర్వాత భార‌త్ క్రికెట‌ర్లు విరాట్ కోహ్లీ, స‌చిన్ టెండూల్క‌ర్‌, రికీ పాంటింగ్‌, అలెన్ బోర్డ‌ర్, కుమార సంగ‌క్క‌ర ఏడు ప‌ర్యాయాలు ఒకే టెస్టులో సెంచ‌రీ, హాఫ్ సెంచ‌రీ చేసి నాలుగో స్థానంలో ఉన్నారు.     

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.