మంగళవారం 27 అక్టోబర్ 2020
Sports - Sep 22, 2020 , 20:38:49

శాంసన్ 74 ఔట్‌..స్మిత్‌ హాఫ్‌సెంచరీ

శాంసన్ 74 ఔట్‌..స్మిత్‌ హాఫ్‌సెంచరీ

షార్జా: ఐపీఎల్-2020  సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాట్స్‌మన్‌ సంజూ శాంసన్‌(74: 32 బంతుల్లో 1ఫోర్‌, 9సిక్సర్లు)  ‌ పరుగుల వరద పారించాడు.   ధనాధన్‌ బ్యాటింగ్‌తో కేవలం 19 బంతుల్లోనే  అర్ధశతకం సాధించిన శాంసన్‌ ఎంగిడి బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి చాహర్‌ చేతికి చిక్కాడు. దీంతో 132 పరుగుల వద్ద రాజస్థాన్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న స్టీవ్‌ స్మిత్‌ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు.

శాంసన్‌ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన హార్డ్‌హిట్టర్‌ డేవిడ్‌ మిల్లర్‌ రనౌటయ్యాడు. కనీసం ఒక్క బంతిని కూడా అతడు ఎదుర్కోలేదు. 13 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్‌ 3 వికెట్లకు 137 పరుగులు చేసింది. స్మిత్‌(51), ఉతప్ప(2) క్రీజులో ఉన్నారు. 


logo