బుధవారం 02 డిసెంబర్ 2020
Sports - Nov 07, 2020 , 18:46:30

విరాట్‌ కోహ్లీని రెచ్చగొట్టొద్దు: స్టీవ్‌వా

విరాట్‌  కోహ్లీని రెచ్చగొట్టొద్దు: స్టీవ్‌వా

మెల్‌బోర్న్‌: టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని రెచ్చగొట్టొద్దని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌వా కంగారూలకు సూచించాడు. ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కానున్న ఆసీస్‌ పర్యటనలో విరాట్‌తో జాగ్రత్తగా ఉండాలని.. స్లెడ్జింగ్‌ జోలికి వెళ్తే అది ఆస్ట్రేలియాకే నష్టమని స్టీవ్‌వా అన్నాడు. 

‘స్లెడ్జింగ్‌ కోహ్లీని ఏం చేయలేదు. అతడిలాంటి గొప్ప ఆటగాళ్లపై ఇది ఏ మాత్రం ప్రభావం చూపదు. అతడిని వదిలేయడమే ఉత్తమం. కాదని మాట జారితే అది అతడికి మరింత ప్రేరణ ఇస్తుంది. తనను తాను నియంత్రించుకోవడంలో కోహ్లీ చాలా మెరుగయ్యాడు’అని స్టీవ్‌వా అన్నాడు. 

గత ఆసీస్‌ పర్యటనలో కెప్టెన్‌ టిమ్‌ పైన్‌తో పాటు మరికొందరు ఆటగాళ్లు కోహ్లీని స్లెడ్జింగ్‌ చేసినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఐపీఎల్‌ 13వ సీజన్‌ ముగియగానే భారత ఆటగాళ్లు.. ఆసీస్‌ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ టూర్‌లో టీమ్‌ఇండియా 3 వన్డేలు, 3 టీ20లు, 4 టెస్టులు ఆడనుంది. నవంబర్‌ 27న ప్రారంభం కానున్న ఈ పర్యటన వచ్చే ఏడాది జనవరి 19తో ముగియనుంది.