మంగళవారం 14 జూలై 2020
Sports - Jun 19, 2020 , 15:20:56

స్లెడ్జింగ్ నాపై ప్ర‌భావం చూప‌దు: పుజారా

స్లెడ్జింగ్ నాపై ప్ర‌భావం చూప‌దు:  పుజారా

న్యూఢిల్లీ: ప‌్ర‌త్య‌ర్థి జ‌ట్లు స్టెడ్జింగ్ చేసినా ఆ ప్ర‌భావం త‌న‌పై ఉండ‌ద‌ని భార‌త టెస్టు బ్యాట్స్‌మ‌న్ చ‌తేశ్వ‌ర్ పుజారా అంటున్నాడు. ఏకాగ్ర‌త‌తో క్రీజులో నిలుచున్న‌ప్పుడు ప్ర‌త్య‌ర్థులు ఎంత‌లా క‌వ్వించినా తాను చ‌లించ‌న‌ని పుజారా చెప్పాడు. టెస్టుల్లో వ‌న్‌డౌన్‌లో బ్యాటింగ్ చేసే పుజారా.. రాహుల్ ద్ర‌విడ్ త‌ర్వాత మ‌రో వాల్‌గా పేరు తెచ్చుకున్నాడు. పిచ్ ప‌రీక్ష పెడుతున్నా.. ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్లు బౌన్స‌ర్లు విసురుతున్న అచంచల ఆత్మ‌విశ్వాసం క్రీజులో పాతుకుపోయే పుజ్జీ.. భార‌త జ‌ట్టుకు ఎన్నో మ‌ర‌పురాని విజ‌యాలు అందించాడు. గ‌త ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లోనూ పుజారా దంచికొట్టిన విష‌యం తెలిసిందే. ఆసీస్ గ‌డ్డ‌పై కంగారూ పేస‌ర్లు త‌మ భీక‌ర పేస్‌తో విజృంభిస్తున్నా ఏమాత్రం వెర‌వ‌కుండా త‌న బ్యాట్‌తోనే వారికి బ‌దులిచ్చాడు.

`స్లెడ్జింగ్ గురించి పెద్ద‌గా ప‌ట్టిచ్చుకోను. వికెట్ ప‌డ‌క అస‌హ‌నంతో ఉన్న‌ప్పుడు ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్లు నోటికి ప‌నిచెబుతారు. అలాంట‌ప్పుడు నేను వాటి గురించి అస‌లు ఆలోచించ‌ను. మ‌న ఏకాగ్ర‌త చెద‌ర‌గొట్టాల‌నే ప్ర‌యత్నాలు చేస్తారు. అలాంట‌ప్పుడే నేను మ‌రింత ఆత్మ‌విశ్వాసంతో బ్యాటింగ్ చేస్తా. బ్యాక్‌ఫుట్‌పై ఆడుతూ.. బంతిని బ్యాట్ మ‌ధ్య‌లో తాకించేందుకు ప్ర‌య‌త్నిస్తా. ల‌య దొర‌క‌బుచ్చుకుంటే మ‌న దృష్టి చెద‌ర‌దు` అని పుజారా చెప్పాడు.


logo