గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Mar 10, 2020 , 00:38:23

విశ్వక్రీడలకు మేరీకోమ్‌

విశ్వక్రీడలకు మేరీకోమ్‌
  • టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత అమిత్‌, సిమ్రన్‌జిత్‌ కూడా..
  • ఆసియా ఒలింపిక్‌ బాక్సింగ్‌ క్వాలిఫయర్స్‌

అమన్‌(జోర్డాన్‌): ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌, భారత అగ్రశ్రేణి బాక్సర్‌ మేరీకోమ్‌, ప్రపంచ చాంపియన్‌షిప్‌ రజత పతక విజేత అమిత్‌ పంగల్‌, కాంస్య పతక విజేత సిమ్రన్‌  జిత్‌  కౌర్‌ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. సోమవారం ఇక్కడ జరిగిన ఆసియా ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో విజయం సాధించి సెమీస్‌కు చేరి టోక్యో బెర్తులు దక్కించుకున్నారు. మహిళల 51కేజీల విభాగం క్వార్టర్స్‌లో రెండో సీడ్‌ మేరీ 5-0తో ఐరిశ్‌ మాంగో(ఫిలిప్పీన్స్‌)పై సునాయాస విజయం సాధించి, రెండోసారి ఒలింపి క్స్‌లో  సెమీస్‌లో యువా న్‌ చాంగ్‌(చైనా)తో మేరీ మంగళవారం తలపడనుంది.


పురుషుల విభాగంలో టాప్‌ సీడ్‌ అమిత్‌ పంగల్‌(52కేజీలు) 4-1తేడాతో కార్లో పాలమ్‌(ఫిలిప్పీన్స్‌)ను చిత్తుచేశాడు. దీంతో అమిత్‌ తొలిసారి ఒలింపిక్స్‌లో అడుగుపెట్టనున్నాడు. మహిళల విభాగంలో సిమ్రన్‌జిత్‌  కౌర్‌(60కేజీలు) 5-0తో నమున్‌ మన్‌కోర్‌ (మంగోలియా) పై గెలిచి, తొలిసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. క్వార్టర్స్‌లో మరో భారత బాక్సర్‌, ప్రపంచ చాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత మనీశ్‌ కౌశిక్‌(63కేజీలు) 2-3తేడాతో మూడో సీడ్‌ చింగోరిజ్‌ బాతాసుఖ్‌(మంగోలియా) చేతి లో ఓడాడు. అయితే, క్వార్టర్స్‌లో ఓడిన బాక్సర్ల మధ్య బాక్స్‌ఆఫ్‌లో హారిసన్‌ గర్సైడ్‌(ఆస్ట్రేలియా)తో కౌశిక్‌ గెలిస్తే  ఒలింపిక్స్‌  బెర్త్‌  దక్కుతుంది. మహిళల విభాగంలో క్వార్టర్స్‌లో జూనియర్‌ ప్రపంచ మాజీ చాంపియన్‌ సాక్షి చౌదరి(57కేజీలు) 0-5తేడాతో ఇమ్‌ అజే(కొరియా) చేతిలో ఓడి ఒలింపిక్స్‌ అవకాశాన్ని చేజార్చుకుంది. ఇప్పటి వరకు టోక్యో ఒలింపిక్స్‌కు భారత్‌ తరఫున  8మంది బాక్సర్లు అర్హత సాధించా రు. 2012 లండన్‌ విశ్వక్రీడలకు గరిష్ఠంగా 8మంది బాక్సర్లు అర్హత సాధించగా.. ఈసారి ఆ రికార్డు బద్దలయ్యే అవకాశం ఉంది. 


logo