హైదరాబాద్: క్రీడాభిమానులను అలరించేందుకు మరో లీగ్ సిద్ధమవుతున్నది. ఇప్పటికే దేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఇండియన్ సూపర్ లీగ్, ప్రో కబడ్డీ లీగ్, బ్యాడ్మింటన్ లీగ్‌లు విశేష ప్రేక్షకాదరణ పొందగా.. ఇప్పుడు అదే బాటలో ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) ముందుకు రాబోతున్నది. ఆరు ఫ్రాంచైజీల (కాలికట్ హీరోస్, కోచి బ్లూ స్పైకర్స్, అహ్మదాబాద్ డిఫెండర్స్, హైదరాబాద్ బ్లాక్ హాక్స్, చెన్నై బ్లిట్జ్, బెంగళూరు టార్పడోస్)తో కూడిన ఈ లీగ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు పీవీఎల్ సీఈవో జాయ్ భట్టాచార్య బుధవారం తెలిపారు.