WTC Final 2023 : భారత్, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ అంటేనే ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధాలు, కవ్విపు చర్యలు గుర్తుకొస్తాయి. ఇప్పుడు టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లోనూ అలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఫైనల్ రెండో రోజు భారత పేసర్ సిరాజ్(Mohammad Siraj) ఆసీస్ ఆటగాళ్ల యాక్షన్‌కు ‘తగ్గేదేలే’ అంటూ కౌంటర్ ఇస్తున్నాడు. రెండో రోజు తొలి సెషన్ మొదటి ఓవర్లో సిరాజ్ కోపంతో బంతిని స్ట్రైకర్ వికెట్లపైకి విసిరాడు. ఎందుకంటే..? ఓవర్ నైట్ స్కోర్ 95 వద్ద ఉన్న స్టీవ్ స్మిత్(Steve Smith) వరస బౌండరీలతో సెంచరీకి చేరువయ్యాడు. అయితే.. తర్వాత బంతి వేసేందుకు సిరాజ్ బౌలింగ్ ఎండ్ నుంచి పరుగెత్తుకుంటూ వచ్చాడు. తీరా బంతి విసిరే సమయానికి స్మిత్ క్రీజు నుంచి పక్కకు జరిగాడు.
Siraj got no chill pic.twitter.com/ui4DyobB70
— W. (@CFCstorm_) June 8, 2023
స్పైడర్ కెమెరా అడ్డంగా వచ్చిందని చెప్పి అతను సిగ్నల్ ఇస్తూ సైడ్‌కు జరిగాడు. దాంతో, కోపంతో ఊగిపోయిన సిరాజ్ బంతిని వికెట్లపైకి విసిరేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తొలి రోజు మొదటి వికెట్ తీసిన సిరాజ్ రెండో రోజు కూడా భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు. డేంజరస్ ట్రావిస్ హెడ్(163)ను ఔట్ చేసి టీమిండియాను పోటీలోకి తెచ్చాడు.