గురువారం 21 జనవరి 2021
Sports - Dec 26, 2020 , 13:26:55

బాక్సింగ్ డే టెస్ట్‌.. సిరాజ్ అరంగేట్రం అదిరింది

బాక్సింగ్ డే టెస్ట్‌.. సిరాజ్ అరంగేట్రం అదిరింది

మెల్‌బోర్న్‌:  మొహ‌మ్మ‌ద్ సిరాజ్ మెరిశాడు. అరంగేట్రం టెస్టులోనే అద‌ర‌గొట్టాడు. మెల్‌బోర్న్‌లో కీల‌క‌మైన రెండు వికెట్లు తీసి .. ఆస్ట్రేలియాను క‌ట్ట‌డి చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. రెండు వికెట్లు తీయ‌డ‌మే కాదు.. రెండు అద్భుత‌మైన క్యాచ్‌ల‌ను కూడా అందుకున్నాడు. బాక్సింగ్ డే టెస్టులో తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకున్న‌ది. అయితే సిరాజ్‌కు మాత్రం రెండ‌వ సెష‌న్‌లో వికెట్‌ ద‌క్కింది.  26 ఏళ్ల హైద‌రాబాదీ ప్లేయ‌ర్‌కు ఈ మ్యాచ్ ఓ మ‌ధుర జ్ఞాప‌కంగా మార‌నున్న‌ది. 15 ఓవ‌ర్లు వేసిన సిరాజ్ నాలుగు మెడిన్లు వేసి 40 ప‌రుగులు ఇచ్చాడు. 

మెల్‌బోర్న్ టెస్ట్‌లో తొలి ఓవ‌ర్ వేసేందుకు సిరాజ్‌కు 28 ఓవ‌ర్ల పాటు నిరీక్షించాల్సి వ‌చ్చింది.  ఓ ర‌కంగా కెప్టెన్ ర‌హానే .. హైద‌రాబాదీని కొంత టెన్ష‌న్ పెట్టాడు. రెండ‌వ స్పెల్‌లో వేసిన 43వ బంతికి సిరాజ్ ఖాతాలో వికెట్ ప‌డింది.  ఆస్ట్రేలియాను భారీ స్కోర్ దిశ‌గా తీసుకువెళ్తున్న ల‌బుషేన్ వికెట్‌ను సిరాజ్ తీయ‌డం విశేషం.  సిరాజ్ త‌న 8 ఓవ‌ర్‌లోని మూడ‌వ బంతికి వికెట్ తీశాడు.  హైద‌రాబాదీ వేసిన బౌన్స‌ర్ హెల్మ‌ట్‌కు త‌గ‌ల‌డంతో.. ఆ త‌ర్వాత బంతిని ల‌బుషేన్ హుక్ చేయాల‌నుకున్నాడు.  కానీ లెగ్‌సైడ్‌లో ఉన్న గిల్ ఆ క్యాచ్ అందుకున్నాడు. మ‌రో కీల‌క ప్లేయ‌ర్ కెమ‌రూన్ గ్రీన్‌ను.. సిరాజ్ ఎల్బీడ‌బ్ల్యూ ఔట్ చేశాడు.  వికెట్లు ముందే గ్రీన్‌ను ప‌ట్టేశాడు సిరాజ్‌. దీంతో అంపైర్ పౌల్ రైఫిల్ ఈజీగా అత‌నికి ఔట్ ఇచ్చేశాడు.  బ్యాట్స్‌మెన్ డీఆర్ఎస్‌కు వెళ్లినా.. తీర్పు మాత్రం సిరాజ్‌కు అనుకూలంగా వ‌చ్చింది.  

సిరాజ్ వేస్తున్న స్పీడ్ బంతుల‌ను ఆసీస్ కామెంటేట‌ర్లు మెచ్చుకున్నారు. అసాధార‌ణ రీతిలో సిరాజ్ బౌలింగ్ వేస్తున్న‌ట్లు కితాబు ఇచ్చారు. ఫీల్డింగ్‌లో కూడా  సిరాజ్ త‌న స‌త్తా చాటాడు.  బుమ్రా బౌలింగ్ స్టార్క్ కొట్టిన హుక్ షాట్‌తో బంతి గాలిలోకి ఎగిరింది. దాన్ని ఫైన్ లెగ్‌లో ఉన్న  సిరాజ్ అద్భుతంగా అందుకున్నాడు.  ఇక జ‌డేజా బౌలింగ్ భారీ షాట్‌కు వెళ్లిన క‌మ్మిన్స్‌ను.. లాన్‌లైన్‌లో అద్భుత రీతిలో సిరాజ్ క్యాచ్ అందుకున్నాడు. అంత‌కుముందు ఉద‌యం స్పిన్న‌ర్ అశ్విన్‌.. సిరాజ్‌కు అరంగేట్రం క్యాప్ అందించాడు.   

ఆటోరిక్షా డ్రైవ‌ర్ కుమారుడైన సిరాజ్‌.. టీమిండియా త‌ర‌పున ఆడిన రెండ‌వ ఫాస్ట్ బౌల‌ర్‌.  గ‌తంలో ఇండియా త‌ర‌పున స‌య్యిద్ అబిద్ అలీ టీమిండియా త‌ర‌పున ఫాస్ట్ బౌల‌ర్‌గా ఆడాడు.  అబిద్ అలీ 1966లో అడిలైడ్‌లో టెస్ట్ అరంగేట్రం చేశాడు.  ఆ మ్యాచ్‌లో అత‌ను 55 ప‌రుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీసుకున్నాడు. టీమిడియా త‌ర‌పున టెస్టుల‌కు ఆడుతున్న 298వ ప్లేయ‌ర్‌గా సిరాజ్ నిలిచాడు. మెల్‌బోర్న్ టెస్టులో తొలి రోజు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 195 ర‌న్స్‌కు ఆలౌట్ కాగా.. ఇండియా ఆట ముగిసే స‌మ‌యానికి వికెట్ న‌ష్టానికి 36 ర‌న్స్ చేసింది. logo