గురువారం 04 మార్చి 2021
Sports - Jan 28, 2021 , 02:06:29

ఐసీసీ అవార్డు రేసులో సిరాజ్‌

ఐసీసీ అవార్డు రేసులో సిరాజ్‌

దుబాయ్‌: క్రికెట్‌ను అభిమానులకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ఐసీసీ కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డును తీసుకొచ్చింది. నెల రోజుల వ్యవధిలో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమంగా రాణించిన ప్లేయర్లను అవార్డు కోసం పరిగణనలోకి తీసుకోనుంది. ఇటీవల ఆస్ట్రేలియాపై ప్రతిష్టాత్మక బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ చరిత్రాత్మక విజయంలో కీలకమైన హైదరాబాదీ స్పీడ్‌స్టర్‌ మహమ్మద్‌ సిరాజ్‌తో పాటు అశ్విన్‌, పంత్‌, నటరాజన్‌ ఈ అవార్డు కోసం పోటీలో ఉన్నారు. వీరితో పాటు జోరూట్‌, స్టీవ్‌స్మిత్‌, రహ్మనుల్లా గుర్బాజ్‌, మారిజానె కాప్‌, నదినె డీక్లార్క్‌, నిదా దార్‌ ఉన్నారు. మాజీ ప్లేయర్లు, బ్రాడ్‌కాస్టర్స్‌, స్పోర్ట్స్‌ జర్నలిస్టులు, అభిమానులు కలిసి ఆన్‌లైన్‌ ద్వారా ఓటింగ్‌లో పాల్గొనవచ్చని ఐసీసీ జనరల్‌ మేనేజర్‌ జెఫ్‌ అలార్‌డైస్‌ పేర్కొన్నారు. ఓట్ల శాతం ఆధారంగా ప్రతి నెల రెండో సోమవారం డిజిటల్‌ చానల్స్‌ ద్వారా విజేతను ప్రకటిస్తామని అన్నారు. 

VIDEOS

logo