సింగపూర్: కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో సింగపూర్ ఫార్ములావన్ గ్రాండ్‌ప్రి రేసు రద్దయ్యింది. మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తున్న క్రమంలో రేసర్ల ఆరోగ్యంతో పాటు ప్రయాణ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు శనివారం ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి 3 తేదీల మధ్య మెరీనా బే స్ట్రీట్ సర్యూట్‌లో జరుగాల్సి ఉంది.