సోమవారం 30 మార్చి 2020
Sports - Jan 27, 2020 , 00:22:40

హైదరాబాద్‌ బోణీ

హైదరాబాద్‌ బోణీ

లక్నో: ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు రాణించడంతో ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌) ఐదో సీజన్‌లో హైదరాబాద్‌ హంటర్స్‌ తొలి విజయం నమోదు చేసింది. ఆదివారం ఇక్కడ జరిగిన టైలో హైదరాబాద్‌ 2-1తో అవధె వారియర్స్‌పై గెలిచింది. తొలుత పురుషుల సింగిల్స్‌లో హంటర్స్‌ ప్లేయర్‌ సౌరభ్‌ వర్మ 14-15, 15-12, 15-10తో శుభంకర్‌ డేపై గెలిచాడు. ఆ తర్వాత జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌లోనూ ఎన్‌.సిక్కిరెడ్డి-వ్లాదిమర్‌ ఇవనోవ్‌ ద్వయం 15-12, 15-14తో ట్రంప్‌ మ్యాచ్‌గా ఎంపిక చేసుకున్న అవధె జోడీపై సునాయాస విజయం సాధించింది. అనంతరం మహిళల సింగిల్స్‌లో స్టార్‌ ప్లేయర్‌ సింధు 15-8, 15-8తో వారియర్స్‌ క్రీడాకారిణి తన్వి లాడ్‌పై అలవోకగా గెలువడంతో హైదరాబాద్‌ 3-0తో దూసుకెళ్లింది. ఆ తర్వాత హంటర్స్‌ ట్రంప్‌ మ్యాచ్‌గా ఎంపిక చేసుకున్న పురుషుల సింగిల్స్‌లో డారెన్‌ లీ 14-15, 9-15తో వారియర్స్‌ ప్లేయర్‌ విన్సెంట్‌పై ఓడిపోవడంతో ఆధిక్యం 2-0కు తగ్గింది. ఆ తర్వాత జరిగిన పురుషుల డబుల్స్‌లోనూ అవధె వారియర్స్‌ గెలువడంతో హైదరాబాద్‌ చివరికి 2-1తో విజయం సాధించింది.


logo