శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Sports - Jan 25, 2021 , 00:54:31

వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌కు సింధు, శ్రీకాంత్‌

వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌కు సింధు, శ్రీకాంత్‌

బ్యాంకాక్‌: ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీకి భారత స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌ అర్హత సాధించారు. గతేడాది చైనా వేదికగా జరుగాల్సిన ఈ టోర్నీ కరోనా కారణంగా వాయిదా పడి ఈ నెల 27 నుంచి 31 వరకు థాయ్‌లాండ్‌లో జరుగనుంది. టొయోటా థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో సెమీస్‌ చేరిన భారత పురుషుల డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌శెట్టి, మిక్స్‌డ్‌ డబుల్స్‌ ద్వయం సాత్విక్‌-అశ్వినీ పొన్నప్పుకు టూర్‌ ఫైనల్స్‌లో చోటు దక్కలేదు. ర్యాంకింగ్స్‌లో టాప్‌-8లో ఉన్న ప్లేయర్లు, డబుల్స్‌ జోడీలు టోర్నీలో తలపడాల్సి ఉండగా.. కరోనా ఆందోళనతో జపాన్‌, చైనా షట్లర్లు  దూరమవడంతో 14వ ర్యాంకులో ఉన్న శ్రీకాంత్‌ క్వాలిఫై అయ్యాడు.

VIDEOS

logo