గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Jan 29, 2020 , 00:15:37

ఫిట్‌నెస్‌ ముఖ్యం: సింధు

ఫిట్‌నెస్‌ ముఖ్యం: సింధు
  • నేటి నుంచి హైదరాబాద్‌లో పీబీఎల్‌

హైదరాబాద్‌: టోక్యో ఒలింపిక్స్‌లో సత్తాచాటేందుకు ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడంతో పాటు ఎంపిక చేసుకున్న టోర్నీలే ఆడాలని నిర్ణయించుకున్నట్టు భారత స్టార్‌ షట్లర్‌, హైదరాబాద్‌ హంటర్స్‌ ప్లేయర్‌ పీవీ సింధు చెప్పింది. బుధవారం నుంచి హైదరాబాద్‌ వేదికగా ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌(పీబీఎల్‌) మ్యాచ్‌లు జరుగనున్న నేపథ్యంలో మంగళవారం ఇక్కడ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడింది. సొంతగడ్డపై జరిగే మ్యాచ్‌ల్లో తప్పక గెలిచి టైటిల్‌ సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేసింది. గెలుపోటములు సహజమని, మ్యాచ్‌లో వంద శాతం కష్టపడడమే ముఖ్యమని చెప్పింది. పీబీఎల్‌లో హైదరాబాద్‌ తరఫున ఆడడం చాలా సంతోషంగా ఉందని తెలంగాణ షట్లర్‌ సిక్కిరెడ్డి తెలిపింది. ఈ కార్యక్రమంలో హంటర్స్‌ ప్లేయర్లతో పాటు జట్టు యజమాని వీఆర్‌కే రావు తదితరులు పాల్గొన్నారు. 

హైదరాబాద్‌ X నార్త్‌ఈస్ట్‌

పీబీఎల్‌ ఐదో సీజన్‌ చివరి దశ మ్యాచ్‌లు 12రోజుల పాటు నగరంలోని గచ్చిబౌలి  వేదికగా జరుగనున్నాయి. బుధవారం జరిగే మ్యాచ్‌లో ఆతిథ్య హైదరాబాద్‌.. నార్త్‌ ఈస్ట్‌ వారియర్స్‌తో తలపడనుంది. 


logo
>>>>>>