బుధవారం 03 జూన్ 2020
Sports - Apr 04, 2020 , 23:52:51

సింధుకు స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగం

సింధుకు స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: పలు జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో పతకాలతో మెరిసిన తెలంగాణ యువ వెయిట్‌లిఫ్టర్‌ గంటల సింధుకు స్పోర్ట్స్‌ కోటా కింద ఆదాయపు పన్నుశాఖలో ఉద్యోగం వచ్చింది. మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తకోట మండలం కొన్నూరు గ్రామానికి చెందిన సింధు..రైతు కుటుంబంలో పుట్టింది. తండ్రి గంటల గోపాల్‌రెడ్డి పెట్రోల్‌ బంక్‌లో చిరు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో వెయిట్‌లిఫ్టింగ్‌ను ఎంచుకున్న సింధు..హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌లో పాఠాలు నేర్చుకుంది. తన కూతురుకు ఉద్యోగం రావడం చాలా సంతోషంగా ఉందని గోపాల్‌రెడ్డి అన్నారు. శనివారం అల్లీపురంలో సాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి సింధును అభినందించారు. 


logo