లండన్ : మానసిక ఒత్తిడితో ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్ టీమ్ ఈవెంట్తో పాటు వ్యక్తిగత ఆల్రౌండ్ పోటీ నుంచి తప్పుకున్న అమెరికన్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్కు భారత క్రికెట్ కోచ్ రవిశాస్త్రి మద్దతు తెలిపాడు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ… ‘నీకు కావాల్సినంత టైమ్ తీసుకో సిమోన్. ఇంత చిన్న వయస్సులోనే కావాల్సిన సామర్థ్యాన్ని నువ్వు సాధించావు. 48 గంటలు కాదు అవసరమైతే 48 రోజుల సమయం తీసుకో. నువ్వు ఎవరికీ వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు’ అని ట్వీట్ చేశాడు. బైల్స్తో పాటు జపాన్ టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి నవోమి ఒసాకాకు కూడా శాస్త్రి మద్దతు ప్రకటించాడు. మరోవైపు సోషల్మీడియాలో బైల్స్ను కొందరు లక్ష్యంగా చేసుకుటుంటే..మరికొందరు మద్దతుగా నిలుస్తున్నారు. ఇదిలా ఉంటే బైల్స్ గైర్హాజరీలో గురువారం జరిగిన మహిళల అర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ఆల్రౌండ్ ఫైనల్లో అమెరికా యువ జిమ్నాస్ట్ సునీసా లీ స్వర్ణ పతకంతో మెరిసింది.