బుచారెస్ట్: ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ నుంచి మహిళల ప్రపంచ మూడో ర్యాంకర్ సిమోనా హలెప్ తప్పుకుంది. కండరాల గాయం కారణంగా మే 30న ప్రారంభం కానున్న మట్టికోర్టు టోర్నీలో ఆడడం లేదని 2018 చాంపియన్ హలెప్ ప్రకటించింది. ‘టోర్నీకి దూరమడవం చాలా బాధగా ఉంది. అయితే నేను గాయం నుంచి కోలుకోవడంపై పూర్తిగా దృష్టిసారిస్తా. సానుకూల దృక్పథంతో ముందుకు సాగి వీలైనంత త్వరగా మళ్లీ కోర్టులో అడుగుపెడతా’ అని రొమేనియా ప్లేయర్ హలెప్ వెల్లడించింది. హలెప్ 2018లో టైటిల్ దక్కించుకుంది.